Old Useful G.Os

Notifications

Results

Sunday, 17 November 2024

IT FY 2024-25 AY 2025-26 Salaried employees useful section info

        ఆదాయం సంపాదించిన ప్రతి ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం జీతం కావచ్చు, పెన్షన్ కావచ్చు లేదా పొదుపు ఖాతా నుండి వచ్చిన వడ్డీ, ఇంటి కిరాయికి ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం మొదలగునవి ఆదాయంగా వచ్చిన వాటికి కూడా పన్ను చెల్లించాలి. ఈసారి బడ్జెట్ లో పాత స్లాబ్ రేట్ లతో పాటు కొత్త స్లాబ్ రేట్ లను కొనసాగించారు. ఈ కొత్త స్లాబ్ రేట్ లు ఆకర్షణీయంగా ఉన్న వాటిని వినియోగించుకోవాలి అంటే మనం గతంలో పొందిన మినహాయింపులు సేవింగ్స్ వదులుకోవాల్సి వస్తుంది. 

Income Tax Slab Rates for FY 2024-25 (Old Regime)

Slabs                                                                                     Age

Range                                        < 60Yrs             >60Yrs and <80 Yrs      >80 Yrs

Upto Rs. 2,50,000                                Nil                                Nil                                 Nil

Rs. 2,50,001 to 3,00,000                       05%                            Nil                                 Nil

Rs. 3,00,001 to 5,00,000                       05%                            05%                              Nil

Rs. 5,00,001 to 10,00,000                     20%                            20%                              20%

Above Rs. 10,00,000                             30%                            30%                              30%

     * If income <=5Lakhs Tax is exempted U/s 87A (max 12,500) 


Income Tax Slab Rates for FY 2024-25 (New Regime)

Slabs                                                                                     Age

Range                                        < 60Yrs             >60Yrs and <80 Yrs      >80 Yrs

Upto Rs. 3,00,000                                Nil                                Nil                                  Nil

Rs. 3,00,001 to 7,00,000                       05%                            Nil                                   Nil

Rs. 7,00,001 to 10,00,000                     05%                            05%                                Nil

Rs. 10,00,001 to 12,00,000                    20%                            20%                               20%

Rs. 12,00,001 to 15,00,000                    20%                            20%                               20%

Above Rs. 15,00,000                             30%                            30%                                30%

     * If income <=7Lakhs Tax is exempted U/s 87A (max 20,000) 


New Regime (కొత్త రెజిమ్) లో ఈ ఆర్ధిక సంవత్సరంలో కొన్ని మినహాయింపులకు అవకాశం కల్పించారు. 
  • ఈ బడ్జెట్ లో కొత్త రెజిమ్ లో హోమ్ లోన్ తీసుని అట్టి ఇంటిని కిరాయికి ఇచ్చినట్టయితే అట్టి ఇంటి కిరాయిని ఆదాయంలో చూపి లోన్ పై చెల్లించిన వడ్డీ మొత్తాన్ని మినహాయింపు పొందవచ్చు. 
  • ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 నుండి కొత్త రెజిమ్ లో U/s 16(1a) కింద రూ. 75,000 మినహాయింపు పెంచుతు అవకాశం కల్పించారు. 
  • Section 87A ని కొత్త రెజిమ్ లో కూడా ఈ ఆర్ధిక సంవత్సరం 2024-25లో 7 లక్షలలోపు ఆదాయం కలిగి ఉన్నవారికి గరిష్టంగా రూ. 20,000 వరకు రిబేట్ అవకాశం కల్పించారు. 
  • డిజబుల్డ్ వారికి ఇచ్చే అలవెన్సులకు మినహాయింపు, ట్రావెలింగ్ అలవెన్సులకు మినహాయింపు. 
  • NPS లో ప్రభుత్వం జమచేసిన నిధికి సెక్షన్ 80CCD(2) మినహాయింపు వర్తిస్తుంది.

మనము సెక్షన్ 192 (పాత విధానం లో) కానీ సెక్షన్ 115 BAC (కొత్త విధానంలో) కానీ టాక్స్ చెల్లించవచ్చు. 

ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం ఆర్థిక సంవత్సరం 2025-25 గణనలో తేది 01.04.2024 నుండి 31.03.2025 వరకు పొందిన జీతభత్యాలు ఆదాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి. 

పాత స్లాబ్ రేట్లతో టాక్స్ స్లాబ్స్ ఏంటో, మినహాయింపులు ఏంటో ఓసారి చూద్దాం.


ఉదా 1: ఒక ఉద్యోగి ఆదాయంలో నుండి ఇంటి అద్దె, ఇతర మినహాయింపులు మరియు 1.50 లక్షల సేవింగ్స్ పోగా పన్ను చెల్లించాల్సిన ఆదాయము 7లక్షలు ఉన్నట్లయితే. అందులో మొదటి 2.5 లక్ష లకు పన్ను లేదు 2,50,001 నుండి 5లక్షలవరకు ఉన్న 2.50 లక్షల పై 5% చొప్పున 12,500/-, తరువాతి 5లక్షల పైబడి ఉన్న 2లక్షలకు 20% చొప్పున 40,000 గణించాలి. మొత్తంగా 12,500+40,000=52,500 అవుతుంది. కాని 7లక్షల నుండి పన్ను లేని 2.50లక్షలను తీసివేయగా వచ్చిన 4.5లక్షలకు 5% చొప్పున 22,500 గా లెక్కించడం సరికాదు.

ఉదా 2: ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం 12లక్షలు ఉంది అనుకుంటె వారు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 10లక్షలు దాటింది కాబట్టి 12,00,000 X 30% = 3,60,000లుగా గణించడం సరికాదు.
2,50,000వరకు పన్ను లేదు, 2,50,001 నుండి 5లక్షలవరకు గల 2.5 లక్ష లకు 5% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500/-, 5లక్షల నుండి 10 లక్షల  వరకు గల 5లక్షలకు 20% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500 + 1,00,000 = 1,12,500/-, 10 లక్షల పైన గల 2లక్షలకు ఆదాయానికి 30% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500 + 1,00,000 + 60,000  = 1,72,500/- చెల్లించాలి

Section 16 గత ఆర్థిక సంవత్సరం 2018-19కు నూతనంగా జీతం ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి గరిష్టంగా Standard Deduction గా రూ.50,000 వరకు సెక్షన్ 16(ia) ద్వారా మినహాయింపునిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కు కొత్త రెజిమ్ లో 75,000 మినహాయింపుకు అవకాశం కల్పించారు. 

Section 87A: ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్న వారికి చెల్లించాల్సిన టాక్స్ లో గరిష్టంగా రూ.12,500 వరకు రిబేట్ సదుపాయాన్ని పెంచారు. ఈ సెక్షన్ ఉపయోగించుకుని 5లక్షల లోపు ఆదాయం కలిగిన వారు పూర్తి టాక్స్ మినహాయింపు పొందుతారు. ఈ సెక్షన్ ని కొత్త రెజిమ్ లో ఈ ఆర్ధిక సంవత్సరం 2024-25లో 7 లక్షలలోపు ఆదాయం కలిగి ఉన్నవారికి గరిష్టంగా రూ. 20,000 వరకు రిబేట్ అవకాశం కల్పించారు. 

* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన అదనంగా చెల్లించాల్సిన హెల్త్ & ఎడ్యుకేషన్ సెస్ 4%.  

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:- 

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ||నవి ఆదాయంగా పరిగణించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు:- 
పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP (TS) GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు GPF, (TS) GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

మినహాయింపులు: 
1. HRA మినహాయింపు: Under Section 10(13A) 
ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం 
ఇంటి అద్దె గా చెల్లించిన మొత్తం - 10% 
(Pay +DA) 40% వేతనం 

ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/- (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి.

IT Department circular No. 8/2013 Dt.  10.10.2013 ప్రకారం మీరు చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు. పేరెంట్స్ పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్టయితే రెంట్ వారికి చెల్లిస్తున్నట్టు చూపితే పేరెంట్స్ మీ నుండి పొందిన రెంట్ డబ్బులను వారు ఆదాయంలో చూపాల్సి ఉంటుంది.

Section 80GG: ఎలాంటి ఇంటి అద్దె భత్యం పొందని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తన పేరిట కాని, తన స్పౌజ్ పెరిట కాని, తన మైనర్ పిల్లల పేరిట కాని ఎక్కడ కూడా ఇల్లు లేని, అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది
1.     Rent paid minus 10% of total income
2.     Rs. 5000/- per month
3.     25% of total income
పై మూడింటిలో ఏది కనిష్ఠమో దానిని పరిగణలకు తీసుకుని సంవత్సరానికి గరిష్ఠంగా 60,000 వరకు మినహాయింపు వర్తిస్తుంది.

2. ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణంతో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణంపై చెల్లిస్తున్న వడ్డిపై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒకవేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయికి ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.  
Section 80EE: ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల (బ్యాంకు) నుండి రుణం పొంది. ఇంటి విలువ 50లక్షలు లోపు ఉండాలి, ఋణం 35లక్షల లోపు  01.04.2016 నుండి 31.03.2017 మద్యన తీసుకున్న ఋణం వడ్డీ పై Section 24 కి అదనంగా 50,000 వేల మినహాయింపు కలదు.

Section 80EEA: ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల (బ్యాంకు) నుండి రుణం పొంది. స్టాంప్ డ్యూటీ విలువ 45లక్షలు లేదా లోపు ఉండాలి 01.04.2019 నుండి 31.03.2022 మద్యన తీసుకున్న రుణం వడ్డీ పై Section 24 కి అదనంగా 1,50,000 వేల మినహాయింపు కలదు.
3.ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E): Self, Spouse, Children ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై 2023-24 ఆర్థిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు ఋణం ముగిసే వరకు లేదా గరిష్టం గా 8 సం. లు వర్తిస్తుంది.
4.ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD): ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటే సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటే 75,000/- , 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటే 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకొసం సంబంధిత అధికారులు జారిచేసిన సర్టిఫికెట్ పొంది ఉండాలి. ITR file చెసె సమయములో 10-IA సమర్పించాలి.
5.ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తీ వికలాంగులయితే (80U): ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటే 75,000/-, 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటే 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి. ITR file చెసె సమయములో 10-IA సమర్పించాలి అని చెప్పారు కాని సమర్పించని వారికి ఎలాంటి  ఇబ్బంది కలిగినట్టు నా దృష్ఠికి రాలేదు.
6.అనారోగ్య చికిత్సకు అయిన ఖర్చు (80DDB): ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Thalassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 1,00,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDOలకు లేదు.
7.చందాలు (80G) :  PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గల వాటికి ఇచ్చే చందాలు మినహా, 80G క్రింద కు వచ్చే 50% లేదా 30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.
* Note: సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2023 లోపు Income Tax Department వారికి ITR ఫారంలో సమర్పించిన తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA / DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad) తిరిగి పొందవచ్చు.
8.మెడికల్ ఇన్సూరెన్స్ (80D): ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/-, ఉద్యోగికి మరియు పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/-, సీనియర్ సిటిజెన్ అయితే ప్రీమియం కాని గరిష్టంగా 50,000/- మినహాయింపు పొందవచ్చు. 
ఉద్యోగి మరియు పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే  ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.5,000/- మినహాయింపు కలదు.  ఉద్యోగి కుటుంబ సభ్యులకు మరియు పేరెంట్స్ కోసం ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1,00,000/- వరకు మినహాయింపు కలదు.  

        అంధులు లేదా చెవిటి మరియు మూగ లేదా తక్కువ అంత్య భాగాల వైకల్యంతో ఆర్థోపెడిక్‌ వికలాంగ ఉద్యోగులకు తన నివాస స్థలం మరియు అతని విధి స్థలం మధ్య ప్రయాణించు ప్రయోజనం కోసం అతని ఖర్చులను తీర్చడానికి రవాణా భత్యం గా మంజూరు చేయబడిన కన్వేయన్సు అలవెన్స్ ను sub-clause (ii) of clause (14) of section 10 ప్రకారం ప్రతినెల గరిష్టంగా 3200/- వరకు మినహాయింపు కలదు.
 
         మనం ప్రతినెల చెల్లిస్తున్న వృత్తి పన్ను (Professional Tax) కి section 16 (iiiB) ప్రకారం పూర్తిగా మినహాయింపు కలదు.

పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష:

వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C):  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువులకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు. 
Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC): LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల (పెన్షన్) కోసం చేల్లించిన ప్రీమియం. 

3. CPS deduction (80CCD): 

కొత్త పెన్షన్ పై నియామకం అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెల జీతం నుండి 10%చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదు. ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతాలో జమ చేస్తున్న CPS మ్యాచింగ్ గ్రాంట్  10% ని 80CCD(2) ప్రకారం జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనంగా మినహాయింపు కలదు.  FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ము పైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు  సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది.
ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు పైన 2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80C కింద CPS నిధి కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS) నిధి కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు.


* 80C, 80CCC, 80CCD ల పొదుపుల పైన మొత్తము గా 1.5 లక్షలు తగ్గింపు ఉంటుంది.

సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA): సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం మినహాయింపు అవకాశం ఉంది. ఇది రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా మినహాయింపు అవకాశం ఉంది. 
60 సంవత్సరంలు దాటినా సీనియర్ సిటిజన్స్ లకు బ్యాంకు వడ్డీ మినహాయింపు (80TTB): ఖాతా లో జమయిన వడ్డీని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని 80TTB ప్రకారం గరిష్టం గా 50,000/- వరకు అదనముగా మినహాయింపు అవకాశం ఉంది.   
ఎలక్ట్రిక్ వెహికల్ వడ్డీ మినహాయింపు (80EEB): ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఋణంపొంది ఎలక్ట్రిక్ వెహికల్ వాహనం  01.04.2019 నుండి 31.03.2023  మధ్యలో తీసుకున్న వారికి  ఆ ఋణం పై చెల్లించిన వడ్డీ పై 1,50,000  వరకు మినహాయింపు కలదు.
*Note: DDO లు జీతం బిల్లు పొందే సమయములో డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నెంబర్స్ STO/ Online లో STO ల AIN & DDO ల TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా ఇ- పైల్లింగ్ ద్వారా TDS వివరాలు 31 జూలై, 2025 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది. 
ఆదాయపు పన్నుకు సంబంధించి ఏఏ ఫారములు సమర్పించాలి? 
జనవరి మాసములో లేదా ఫిబ్రవరి మాసము మొదటి వారం లోపు మీ సేవింగ్స్ మరియు మినహాయింపులను తెలుపుతూ Form-12BB పూర్తిచేసి DDO లకు ఇవ్వాలి. వాటిని పరిగణలోకి తీసుకుని, నెలవారీగా చెల్లించిన జీతం మరియు జీతం ద్వారా చేసుకున్న పొదుపుల ఆధారంగా DDOలు విధిగా తమ పరిధిలోని ఉద్యోగుల Form-16ని తన పరిధిలోని ఉద్యోగులకు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా ఇవ్వాలి. ఉద్యోగులు బ్యాంకు లలో తమ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే వాటిపై బ్యాంకు వాళ్ళు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా Form 16A ని ఇస్తారు. ITR సమర్పించే సమయంలో 26AS ద్వారా చూసుకుని ఈ ఆదాయాన్ని Income from other source లో చూపిస్తూ DDO లు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ Form 16 తో కలిపి సమర్పించాలి.
ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. ఉద్యోగులు "ITR" ఫారములలో రిటర్న్ లను 31జూలై, 2024 లోపు Income Tax Department వారికి సమర్పించాలి. 


IT FY 2024-25 calculator Full Version

Posted in:

0 comments:

Post a Comment